News December 31, 2024
సమంత వల్లే ఈ అవకాశం: కీర్తి సురేశ్

స్టార్ హీరోయిన్ సమంత వల్లే తనకు బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’లో నటించే అవకాశం వచ్చినట్లు మహానటి కీర్తి సురేశ్ చెప్పారు. ఈ సినిమాకు సమంతానే తనను రిఫర్ చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వరుణ్ ధవన్ ఈ విషయాన్ని తనకు చెప్పినట్లు కీర్తి తెలిపారు. కాగా ‘బేబీ జాన్’ మూవీ ‘తేరి’కి రీమేక్‌గా తెరకెక్కింది. తేరి సినిమాలో సమంత లీడ్ రోల్లో నటించారు.
Similar News
News October 13, 2025
CRDA భవనాన్ని ప్రారంభించిన CM CBN

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన సీఆర్డీఏ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించారు. భవనం లోపల క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బిల్డింగ్ బయట ఫొటోలు దిగారు. హైదరాబాద్‌కు దీటుగా అమరావతిని అభివృద్ధి చేస్తానని సీఎం స్పష్టం చేశారు.
News October 13, 2025
WBలో తాలిబన్ పాలన నడుస్తోంది: BJP, CPM

వైద్య విద్యార్థిని రేప్ ఘటనపై WB CM మమత వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అర్ధరాత్రి ఆమె బయటకు ఎలా వచ్చిందనడంపై నేతలు మండిపడుతున్నారు. ‘ఇక్కడ తాలిబన్ పాలన నడుస్తోంది. మహిళలు రాత్రివేళ బయటకు రావద్దా? వస్తే రేప్ చేస్తామంటారా?’ అని BJP MLA అగ్నిమిత్ర ప్రశ్నించారు. ‘స్త్రీలు పురుషులతో సమానం కాదా? వారి భద్రత ప్రభుత్వ బాధ్యత కాదా?’ అని CPM నిలదీసింది. కాగా తన కామెంట్లను మీడియా వక్రీకరించిందని మమత అన్నారు.
News October 13, 2025
వెండిపై పెట్టుబడి: ట్రేడర్‌కు రూ.600 కోట్ల నష్టం!

కమోడిటీ ట్రేడింగులో అనుభవలేమి నిలువునా ముంచుతుందనేందుకు మరో ఉదాహరణ. కొండెక్కిన వెండిని ఒకరు భారీగా షార్ట్ చేశారని స్టాక్ మార్కెట్ కోచ్ ఏకే మాన్‌ధన్ ట్వీట్ చేశారు. అయితే రేటు ఇంకా ఎగిసి ATHకు చేరడంతో బ్రోకర్ ఆ పొజిషన్లను క్లోజ్ చేశారన్నారు. దాంతో ఆ ట్రేడర్ ఏకంగా రూ.600Cr నష్టపోయాడని తెలిపారు. అతడెవరో ఆయన వెల్లడించలేదు. మొదట ఎక్కువ ధరకు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొని లాభపడటాన్ని షార్టింగ్ అంటారు.