News April 20, 2024

కేసీఆర్ కోటరీ వల్లే పార్టీకి ఈ దుస్థితి: గుత్తా

image

TG: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. దీంతో నేతలు పార్టీ వీడుతున్నారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యల వల్ల తన కుమారుడు పోటీకి దూరంగా ఉన్నారని తెలిపారు. తనకు ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేదన్నారు.

Similar News

News March 4, 2026

ట్రంప్ ‘వీకెండ్’ వార్స్ వెనక ‘మార్కెట్’ ప్లాన్!

image

ట్రంప్ హయాంలో జరిగిన ప్రధాన దాడులన్నీ (ఇరాన్, వెనిజులా, నైజీరియా) శని, ఆదివారాల్లోనే కావడం గమనార్హం. దీని వెనక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వీకెండ్స్‌లో స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో యుద్ధంపై ఇన్వెస్టర్లు వెంటనే స్పందించి షేర్లను అమ్మకుండా ఉంటారు. సోమవారం మార్కెట్లు తెరిచే నాటికి ఓ అంచనా వచ్చి భారీ పతనం తప్పుతుంది. ఈ 48 గంటల్లో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ చూసుకునే అవకాశం ఉంటుంది.

News March 4, 2026

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్

image

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రకటించిన తేదీ(మార్చి 26) కంటే వారం ముందే రిలీజయ్యే అవకాశముంది. ఈ నెల 19న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక BGM కోసం దేవిశ్రీప్రసాద్ స్థానంలో తమన్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.

News March 4, 2026

సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా లేపేస్తాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎన్నుకున్నా వారిని చంపేస్తామని ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ పగ్గాలు చేపట్టే ఏ నేత అయినా తమకు ‘క్లియర్ టార్గెట్’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. ఈ మిషన్‌ను పూర్తి చేయడానికి సిద్ధం కావాలని IDFను ఆదేశించినట్లు తెలిపారు. దివంగత అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ వారసుడిగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.