News March 18, 2024
ఈ పులావ్.. వయాగ్రాతో సమానం!

ప్రపంచంలో ఎన్నో రకాల పులావ్స్ ఉన్నా ఉజ్బెకిస్థాన్ పులావ్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఇది వయాగ్రాలా పని చేస్తుందట. ఆ దేశ జాతీయ వంటకం పులావ్. ఈవెంట్ ఏదైనా ఈ వంటకం ఉండాల్సిందే. దీన్ని యునెస్కో కూడా గుర్తించింది. ఇందులో పురుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే లక్షణాలున్నాయని, వయాగ్రాతో సమానమని ప్రజలు నమ్ముతారు. జీవితంలో ఒకే రోజు బతికి ఉంటామని తెలిస్తే వారు కచ్చితంగా పులావ్ తినాలని కోరుకుంటారట.
Similar News
News August 28, 2025
అమెరికా టారిఫ్స్.. భారత్ ప్లాన్ ఇదే!

అమెరికా 50% టారిఫ్స్ అమల్లోకి రావడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఎగుమతులను 40 దేశాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. యూకే, సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలకు డైమండ్స్, టెక్స్టైల్, లెదర్, సీ ఫుడ్ సహా ఇతర వస్తువులను ఎగుమతి చేయాలని భావిస్తోంది. భారత వస్తువుల క్వాలిటీ బాగుంటుందని, నమ్మకమైన ఎగుమతిదారు అని విదేశాల్లో విశ్వసనీయత ఉండటంతో దాన్ని వాడుకోవాలని యోచిస్తోంది.
News August 27, 2025
ఈ జిల్లాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు ఉండనుంది. మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. మీ జిల్లాలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
News August 27, 2025
గోదావరి పరీవాహక ప్రజలు జాగ్రత్త!

TG: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అది 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందన్నారు. మంజీరా నది వరద అంతా SRSPలోకి రానుంది. అటు కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం ప్రవాహం పెరగనుంది.