News April 5, 2025
బాలీవుడ్ అవార్డుల కన్నా ఈ చీర గొప్పది: కంగన

ఓ అభిమాని పంపిన కాంచీపురం సిల్క్ చీరను ఉద్దేశించి నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన బాలీవుడ్ అవార్డుల కన్నా అద్భుతమైన చీర ఎంతో బెటర్ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. కంగన తెరకెక్కించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను మెచ్చి ఓ వ్యక్తి ఈ చీరను పంపడం గమనార్హం. జనవరి 17న విడుదలైన ‘ఎమర్జెన్సీ’ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచినా ఓటీటీలో మాత్రం ప్రశంసలు అందుకుంటోంది.
Similar News
News April 6, 2025
రష్యా పేరెత్తడానికే US భయపడుతోంది: జెలెన్స్కీ

రష్యా తాజాగా చేసిన దాడుల్లో ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ విషయాన్ని US ఎంబసీకి తెలియజేస్తే బలహీనమైన ప్రతిస్పందన వచ్చిందన్నారు. ‘అగ్రరాజ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ రియాక్షన్ వచ్చింది. వాళ్లు రష్యన్ పేరు చెప్పడానికీ భయపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్‌కు సాయం నిలిచిపోయిన విషయం తెలిసిందే.
News April 6, 2025
PBKS VS RR.. గెలుపెవరిదంటే?

PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా(62), మ్యాక్స్‌వెల్(30) మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్లో PBKSకు ఇదే తొలి ఓటమి.
News April 6, 2025
ఒకే ఒక్కడు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

PAK బౌలర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్ర సృష్టించారు. వరుసగా 2 వన్డేల్లో 12వ స్థానంలో బ్యాటింగ్ చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. NZతో జరిగిన రెండో ODIలో హారిస్ రౌఫ్ హెల్మెట్‌కు బంతి బలంగా తాకడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా నసీమ్ వచ్చారు. దీంతో ముఖీమ్ 12వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగారు. మూడో ODIలో ఇమామ్ దవడకు గాయమవడంతో సబ్‌స్టిట్యూట్‌గా ఉస్మాన్ వచ్చారు. దీంతో ముఖీమ్ మరోసారి 12వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు.