News February 1, 2025
ఈ స్కూల్‌లో ఏడాదికి రూ.27లక్షలు ఫీజు!

ప్రస్తుతం నాణ్యమైన విద్యను పొందాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిందే. నర్సరీ పిల్లలకు సైతం కొందరు రూ.4-5 లక్షలు వసూలు చేస్తున్నారు. UAEలో ఉండే గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ పాఠశాలలో స్టార్టింగ్ ఫీజే రూ.27లక్షలుగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. కేరళకు చెందిన మరియమ్మ, KS వర్కీ 1968లో UAEలో ఈ విద్యాసంస్థను ప్రారంభించి అమెరికా, ఇండియా, ఇంగ్లండ్‌కూ విస్తరించారు.
Similar News
News December 29, 2025
ఈ నొప్పులతో థైరాయిడ్‌ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News December 29, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <
News December 29, 2025
2025లో 1.22 లక్షల మంది ఐటీ ఉద్యోగుల తొలగింపు

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లక్షకు పైగా టెక్ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 257 కంపెనీలు 1.22 లక్షల మందిని తొలగించాయని Layoffs.fyi అనే ట్రాకర్ పేర్కొంది. అందులో టీసీఎస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కారణం కాగా టారిఫ్స్, ద్రవ్యోల్బణం వల్ల ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి.


