News April 6, 2025
కాంగ్రెస్ ఉదారత వల్లే ఈ పరిస్థితి: కంగనా రనౌత్

వక్ఫ్ బోర్డుల్లో నిబంధనల ఉల్లంఘనకు కాంగ్రెస్ ఉదారతే కారణమని నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శించారు. భారీ స్థాయిలో జరిగిన భూకబ్జాలకు వక్ఫ్ సవరణ బిల్లు పరిష్కారం చూపుతుందన్నారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచే వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో భారీ కుట్ర ఉందని ఆరోపించారు. దాంతో ఇప్పటికీ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఏ ఒక్క వ్యక్తి, కమ్యూనిటీ లేదా సంస్థ చట్టం కంటే ఎక్కువ కాదని పేర్కొన్నారు.
Similar News
News April 7, 2025
VIRAL: జీనియస్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్

యంగ్ టైగర్ NTR, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ తాజాగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు హగ్ చేసుకున్న ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘తారక్‌కి ప్రేమతో’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. రీపోస్ట్ చేసిన NTR, ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని రాసుకొచ్చారు. దీంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీకి వీరు కలిసి పనిచేశారు.
News April 7, 2025
ఎకరానికి రూ.2 కోట్ల డిమాండ్.. కష్టంగా ఎయిర్‌పోర్టు భూసేకరణ!

TG: వరంగల్ జిల్లా మూమునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది. కాగా.. ఎయిర్‌పోర్టు రాకతో కొత్త పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.
News April 7, 2025
ఆస్పత్రిలో SRH ప్లేయర్

నిన్న GTతో మ్యాచులో SRH హర్షల్ పటేల్‌ను తీసుకుంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో పేసర్ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నారు. నిన్న స్లో పిచ్‌పై హర్షల్ కీ బౌలర్ అయ్యేవారని, ఆయన లేకపోవడం SRHను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?