News December 1, 2024
ఈ పాట చాలా కాలం మోగుతూనే ఉంటుంది: రామ జోగయ్య

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘నానా హైరానా’ సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటపై లిరిసిస్ట్ రామ జోగయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఆమ్మో.. ఈ పాట ఇప్పట్లో ఆగదు. చాలా దూరం వెళ్తుంది. చాలా కాలం మోగుతూనే ఉంటుంది’ అని పేర్కొంటూ తనను అభినందించిన డైరెక్టర్లు మెహర్ రమేశ్, మహేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 28, 2026
మొజ్తబా కూడా చనిపోయి ఉంటారు: ట్రంప్

ఇరాన్ అగ్ర నాయకులందరినీ హతమార్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆయన బహిరంగంగా కనిపించలేదని, ప్రకటనలూ వెలువడలేదని గుర్తు చేశారు. ఇరాన్ మిలిటరీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. ఇవి తప్ప మిగతా విషయాల్లో వారు బాగానే ఉన్నారని భావిస్తున్నట్లు సెటైర్ వేశారు.
News March 28, 2026
మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

భారతీయ LPG నిల్వలకు మరింత బూస్ట్ ఇచ్చేందుకు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా వీటికి రక్షణగా భారత నౌకాదళ యుద్ధనౌకలు ఎస్కార్ట్ ఇవ్వనున్నాయి. దేశ ఇంధన అవసరాల కోసం త్వరలోనే మరిన్ని నౌకలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మూడు LPG నౌకలు ఇండియాకు చేరాయి.
News March 28, 2026
జులైలో థియేటర్లలోకి ‘జన నాయకుడు’?

తమిళ స్టార్ నటుడు విజయ్, హెచ్ వినోద్ కాంబోలో తెరకెక్కిన ‘జన నాయకుడు’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఉండాల్సిన ఈ చిత్రం సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే అన్ని అడ్డంకులను పూర్తిచేసి జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.


