News October 31, 2024
ఈ స్వీట్ కేజీ ధర రూ.56,000

లక్నోలోని ‘ఛప్పన్ భోగ్’ షాపులో అమ్మే ‘ఎక్సోటికా’ స్వీట్ ఇండియాలోనే ఖరీదైన మిఠాయిగా గుర్తింపు పొందింది. కేజీ ధర రూ.56,000. అఫ్గాన్ నుంచి పిస్తా, తుర్కియే నుంచి హాజెల్ నట్స్, ఇరాన్ నుంచి మమ్రా బాదం, అమెరికా నుంచి బ్లూబెర్రీస్, సౌతాఫ్రికా నుంచి మకాడమియా గింజలను దిగుమతి చేసుకుంటారు. కొన్ని గ్రాముల బంగారాన్ని సైతం మిక్స్ చేసి స్వీట్ తయారు చేస్తారు. కేజీ బాక్సులో 10 గ్రా. బరువున్న 100 ముక్కలు ఉంటాయి.
Similar News
News February 9, 2026
పెన్షన్ల పెంపుపై కసరత్తు!

TG: చేయూత పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిమితుల దృష్ట్యా 2026-27 బడ్జెట్‌లో ₹1,000, 2027-28 బడ్జెట్‌లో మరో ₹1,000 పెంచాలని పరిశీలిస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు CM రేవంత్ దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్థిక శాఖ అదనపు నిధుల కోసం అన్వేషిస్తోంది. పెన్షన్‌ను ₹2,000 నుంచి ₹4,000కి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News February 9, 2026
పులి ఎదురుపడితే ఏం చేయాలి?

తెలుగు రాష్ట్రాల్లో <<19045804>>పులుల<<>> బెడదతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి ఎదురుపడినప్పుడు అరుస్తూ పరిగెత్తడం, దాక్కోవడం వంటివి చేయొద్దని అటవీ అధికారులు చెబుతున్నారు. పులికి మనం ఆహారం కాదనే స్పష్టమైన సందేశం ఇచ్చేలా దాని కళ్లలోకి చూస్తూ కదలకుండా ఉండాలంటున్నారు. మనం పెద్దగా కనిపించినప్పుడు పులి వేటాడకుండా వెనక్కి తగ్గుతుందట. తమ కంటే పెద్ద ఆకారంలో ఉండేవాటిపై దాడి చేయకపోవడం అడవి జంతువుల లక్షణం.
News February 9, 2026
బాడీ షేమింగ్ చేస్తే శిక్ష పడుతుందని తెలుసా?

వాక్ స్వాతంత్ర్యం అనే పేరుతో చాలామంది జోకులు, వ్యంగ్యంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. అలాంటి వాటిలో బాడీ షేమింగ్ ప్రధానంగా ఉంటుంది. ఇవి బాధితుల్లో మానసిక ఒత్తిడి, ఇబ్బందిని పెంచి.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. అయితే దీని కోసం ప్రత్యేక చట్టాలు లేవు కానీ బాధితులు పరువునష్టం కింద కేసు నమోదు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. దోషిగా తేలితే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.


