News December 9, 2024
WTCలో అత్యధిక విజయాలు ఈ జట్టువే

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఆ జట్టు 64 మ్యాచుల్లో 32 గెలిచింది. రెండో స్థానంలో భారత జట్టు (53 మ్యాచుల్లో 31 విజయాలు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (48 మ్యాచుల్లో 29 విన్స్) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (18), సౌతాఫ్రికా (18), శ్రీలంక (12), పాకిస్థాన్ (12), వెస్టిండీస్ (9) ఉన్నాయి.
Similar News
News October 21, 2025
133M మంది బాలికలు బడికి దూరం!

లింగ సమానత్వంపై ఎన్ని చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా 133 మిలియన్ల బాలికలు చదువుకు దూరంగా ఉన్నట్లు గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (UNSCO) పేర్కొంది. ప్రస్తుతం ప్రైమరీలో 91M, సెకండరీలో 136M మంది బాలికలు నమోదయ్యారు. ఉన్నతవిద్యలో వారి చేరిక 3రెట్లు పెరిగింది. అయితే బీజింగ్ డిక్లరేషన్(1995) మహిళలకు సమానావకాశాలపై తీర్మానించి 3 దశాబ్దాలు దాటుతున్నా అవుట్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ అధికంగానే ఉన్నారని GEM తెలిపింది.
News October 21, 2025
ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు
News October 21, 2025
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

AP: NTR జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ntr.ap.gov.in/