News October 31, 2024

ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు

image

కర్ణాటకలోని హసన్‌ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.

Similar News

News December 16, 2025

పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

image

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు

image

నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గి 4.7 శాతానికి చేరుకుంది. అక్టోబర్‌లో ఇది 5.2%గా ఉండగా తాజా గణాంకాల్లో 8 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మహిళల భాగస్వామ్యం పెరగడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు.

News December 16, 2025

దేశంలోనే తొలి AAD ఎడ్యుసిటీ.. ప్రారంభించనున్న లోకేశ్

image

AP: దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానుంది. ఆయా రంగాల్లో వేలాది మంది నిపుణులను తయారుచేసేందుకు 160 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ దీన్ని నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయంగా పేరొందిన యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి.