News April 13, 2024
ఈసారి ‘IPL’ బీజేపీదే: బండి సంజయ్

TG: ఈసారి ‘IPL’ (ఇండియన్ పొలిటికల్ లీగ్) కప్ తమదేనని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘ఐపీఎల్‌తోపాటు ‘టీపీఎల్’ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కూడా మాదే. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు. బీఆర్ఎస్‌కు ఆటగాళ్లున్నా ఫామ్‌లో లేరు. కిషన్‌రెడ్డి కెప్టెన్సీలో బీజేపీ టీమ్ దూసుకుపోతుంది. 17 సీట్లు సాధించి టీపీఎల్ కైవసం చేసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నితిన్ నబీన్‌ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు ఉ.11 గంటలకు ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం.
News January 19, 2026
WOW.. వైర్లు లేకుండానే విద్యుత్ సరఫరా!

వైర్లు లేకుండానే గాలిలో కరెంట్‌ను పంపి ఫిన్‌లాండ్ శాస్త్రవేత్తలు సంచలనం సృష్టించారు. హెల్సింకి, ఔలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు అల్ట్రాసోనిక్ ధ్వని తరంగాలు, లేజర్ కిరణాల సహాయంతో విద్యుత్తును ఒక చోటు నుంచి మరోచోటుకు విజయవంతంగా పంపారు. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ‘అకౌస్టిక్ వైర్’ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్‌లో ప్లగ్, వైర్ల అవసరం తగ్గుతుంది. Wi-Fi లాగే రేడియో తరంగాల ద్వారా పరికరాలకు విద్యుత్ సరఫరా అందనుంది.
News January 19, 2026
మళ్లీ పెరిగిన బంగారం ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18894920>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,460 పెరిగి రూ.1,46,240కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,34,050 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.3,18,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


