News May 19, 2024
ధ్వజస్తంభానికి ఉపయోగించేది ఈ చెట్టునే!

AP: దేవాలయ ధ్వజస్తంభానికి నారేప చెట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు అధికంగా పాపికొండల్లో లభ్యమవుతుంది. ఇక్కడి నుంచే వేర్వేరు ప్రాంతాలకు ధ్వజస్తంభాల కోసం తరలిస్తుంటారు. అన్ని చెట్లలో కంటే నారేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కర్ర ఎండకు ఎండినా.. వానకు తడిసినా ఏమాత్రం చెక్కు చెదరదు. ప్రకృతి విపత్తులు తలెత్తినా తట్టుకుని దశాబ్దాలపాటు అలాగే ఉంటుంది. ఈ చెట్టును తరలించాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి.
Similar News
News December 4, 2025
ఏపీకి జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారంలోపు ప్రాజెక్టు వాస్తవ స్థితిపై సమాధానం ఇవ్వాలని పేర్కొంది. పోలవరం-నల్లమల సాగర్ డీపీఆర్ కోసం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
News December 4, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్
News December 4, 2025
రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్

AP: అఖండ-2 మూవీ టికెట్‌ను చిత్తూరు MLA గురజాల జగన్మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్‌ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్‌ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.


