News August 13, 2025
ఈ తీర్పు BJP, కాంగ్రెస్‌కు చెంపపెట్టు: KTR

TG: గవర్నర్ కోటా MLCల ఎన్నికపై <<17393463>>సుప్రీంకోర్టు తీర్పు<<>> BJP, కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని KTR అన్నారు. ‘గతంలో BRS పంపిన MLC ప్రతిపాదనలకు BJP అడ్డుపడింది. ఈ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే కాంగ్రెస్ మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు సాగనివ్వమని చాటిచెప్పిన న్యాయవ్యవస్థకు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News August 14, 2025
పెన్షన్లు తీసుకునే వారికి BIG ALERT

AP: అనారోగ్యం, దివ్యాంగుల కేటగిరీల్లో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులిచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియ చేపడతారు. 40% కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారి పెన్షన్లు రద్దు చేస్తారు. అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
News August 14, 2025
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP ఘనవిజయం సాధించడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలి’ అని CM ఆదేశించారు.
News August 14, 2025
సెలవులు రద్దు చేస్తూ ప్రకటన

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బందికి 3 రోజులపాటు ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. రానున్న మూడ్రోజుల పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సూపరింటెండెంట్లు, RMOలు, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు.