News March 29, 2025

ఈ విక్టరీ చాలా స్పెషల్ గురూ!

image

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో CSKపై RCB దాదాపు 17 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2008లో చెన్నైను ఓడించిన బెంగళూరు.. మళ్లీ 6,155 రోజుల తర్వాత ఇప్పుడు గెలుపును నమోదు చేసింది. అందుకే ఈ విజయం RCBకి చాలా స్పెషల్. ఈ సీజన్‌లో పాటీదార్ సేనకు ఇది రెండో విజయం. 4 పాయింట్లతో ఆ జట్టు ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా ఉంది. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించి ఛాంపియన్‌గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Similar News

News January 9, 2026

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం

News January 9, 2026

ఘనంగా ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

image

AP: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ఘనంగా ముగిశాయి. డిసెంబర్‌ 30న ప్రారంభమైన ఈ పవిత్ర దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. 9 రోజుల్లోనే 7 లక్షల మందికి పైగా దర్శన భాగ్యం కలగగా, పదో రోజుతో ఈ సంఖ్య దాదాపు 8 లక్షలకు చేరనుంది. ఈ సందర్భంగా హుండీ కానుకలుగా రూ.36.86 కోట్లు లభించాయి. 37.97 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

News January 9, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.