News July 5, 2024

ఈ వరల్డ్ కప్ మీ కోసమే.. రోహిత్ శర్మ ట్వీట్ వైరల్

image

T20 వరల్డ్ కప్‌తో ఇండియాకు తిరిగొచ్చిన జట్టుకు ముంబైలో అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వస్వాగతం పలికారు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాను ఓపెన్ టాప్ బస్సులో వరల్డ్ కప్‌ను ఎత్తుకుని అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను Xలో షేర్ చేశారు. ‘ఈ కప్ మీకోసమే’ అని పేర్కొంటూ త్రివర్ణ పతాకాన్ని పోస్టు చేశారు. ఈ ట్వీట్ వైరలవుతోంది.

Similar News

News January 16, 2025

తల్లి కాదు రాక్షసి.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిని..

image

సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్‌టాక్‌లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

News January 16, 2025

‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్

image

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News January 16, 2025

కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)

image

రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్‌ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.