News July 9, 2024

ఈ ఏడాది అభిషేక్ శర్మదే!

image

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఈ ఏడాది అత్యుత్తమంగా రాణిస్తున్నారు. ఈ సంవత్సరంలో అభిషేక్ 18 టీ20 మ్యాచులు ఆడి 584 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ ఏకంగా 200కుపైగా ఉండటం విశేషం. పొట్టి క్రికెట్‌లో మరే క్రికెటర్‌కూ ఇంత స్ట్రైక్ రేట్ లేదు. రస్సెల్ (199.47), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (194.13), ట్రావిస్ హెడ్ (176.24), ఫిలిప్ సాల్ట్ (172.67) కూడా అభిషేక్ ముందు దిగదుడుపుగా ఉన్నారు.

Similar News

News November 21, 2025

వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ

image

వాజేడు ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి బదిలీ అయ్యారు. ఐదేళ్లుగా విధులు నిర్వహించిన చంద్రమౌళిని అటవీ శాఖ ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు రేంజికి ఆయన్ను బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఆయన స్థానంలో ప్రస్తుతం వెంకటాపురం(కే) రేంజర్ వంశీకృష్ణకు వాజేడు రేంజర్ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.

News November 21, 2025

24 నుంచి కొత్త కార్యక్రమం

image

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్‌షాపులు నిర్వహిస్తారు.