News June 26, 2024
ఈ ఏడాది ‘హెడ్’ రఫ్ఫాడించారు!

ICC T20 నంబర్ 1 బ్యాటర్ ఆస్ట్రేలియా హిట్టర్ ట్రావిస్ హెడ్ ఏడాది కాలంగా అద్భుతంగా రాణించారు. ఆసీస్ WC-2023 & WTC & Ashes ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. WTC ఫైనల్, WC సెమీస్, WC ఫైనల్లో POTMగా నిలిచారు. WCలో 54.8 యావరేజ్, 127 స్ట్రైక్ రేట్‌తో 329 రన్స్ చేశారు. IPLలో 191.5 స్ట్రైక్ రేట్‌తో 567 రన్స్‌తో ఆకట్టుకున్నారు. T20 WCలో 158.4 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశారు.
Similar News
News December 7, 2025
కోర్ సబ్జెక్ట్ లేదని అనర్హులుగా ప్రకటించలేం: సుప్రీం

అభ్యర్థి PGలో కోర్ సబ్జెక్ట్ లేదని అతడిని అనర్హుడిగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2013లో మానిటరింగ్, ఎవాల్యుయేషన్ కన్సల్టెంట్‌గా ఓ అభ్యర్థి(M.Com) ఎంపికయ్యారు. కానీ స్టాటిస్టిక్స్‌లో PG లేదని అతడిని ప్రభుత్వం తొలగించింది. దీంతో బాధితుడు SCని ఆశ్రయించారు. జాబ్‌కు కావాల్సిన ప్రధాన సబ్జెక్టు అభ్యర్థి చదివాడని, అతడి PG వేరే స్పెషలైజేషన్‌లో ఉందని తిరస్కరించలేమని SC స్పష్టం చేసింది.
News December 7, 2025
భారీ జీతంతో రైట్స్‌లో ఉద్యోగాలు..

<
News December 7, 2025
ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.


