News February 10, 2025
ఆ 11 గొర్రెలే గర్జించే సింహాలవుతాయ్: YCP MLA

AP: చిత్ర వేడుకల్లో హుందాతనంగా ప్రవర్తించాలని, రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ‘ఇప్పుడున్న 11 గొర్రెలే రేపు గర్జించే సింహాలు అవుతాయి. శత్రువులను చీల్చి చెండాడుతాయి. వ్యక్తిగత కక్షలతో ఇండస్ట్రీని బలి చేయడమేంటి? రోజులెప్పుడూ ఒకేలా ఉండవు’ అని ఆయన హెచ్చరించారు. కాగా ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ 150 మేకలు, 11 గొర్రెలంటూ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News March 25, 2026
ఆముదం సాగుకు అనువైన రకాలు

☛ DCH-177: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ DCH-519: 90-180 రోజులు. దిగుబడి: 6-7.5 క్వింటాళ్లు
☛ PCH-111: 90-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ PCH-222: 90-170 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ GCH-08: 95-180 రోజులు. దిగుబడి: 7-8 క్వింటాళ్లు
☛ ICH-66: 90-180 రోజులు. దిగుబడి: 7-9 క్వింటాళ్లు
☛ ICH-5: పంట కాలం 90-180 రోజులు. ఎకరాకు దిగుబడి: 7-9 క్వింటాళ్లు
News March 25, 2026
‘రండి చూసుకుందాం’.. USకు ఇరాన్ సవాల్!

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది సైనికులను పశ్చిమాసియాకు పంపాలని అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. 20 ఏళ్లుగా తాము దీని కోసమే ట్రైన్ అవుతున్నామని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతినిధి అడ్మిరల్ అహ్మదియాన్ పేర్కొన్నారు. ‘ఇంకా దగ్గరకు రండి’ అంటూ సవాల్ విసిరారు. దీన్ని బట్టి ఇరాన్ సైన్యం నేరుగా తలపడేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
News March 25, 2026
ఉగ్రవాద దేశం మధ్యవర్తిత్వమా?

అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిగా ఉండటంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాక్‌కు ఏ అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇరాన్ తర్వాత షియా ముస్లింలు ఎక్కువగా ఉండటం, ట్రంప్‌తో పాక్ ఎయిర్ మార్షల్ మునీర్ స్నేహం కారణంగానే ఇది సాధ్యమైందని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై మీ కామెంట్?


