News February 27, 2025
ఆ 8 మంది చనిపోయి ఉంటారు: అధికారులు

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వాళ్లంతా టీబీఎం మెషీన్ చుట్టూ బురదలో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీమ్ టన్నెల్ చివరివరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్ మళ్లీ కూలే ప్రమాదం ఉందంటున్నారు.
Similar News
News February 27, 2025
BIG ALERT: ఉ.11 తర్వాత బయటికి వెళ్లొద్దు

TGలో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. MAR 2 వరకు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి వెళ్లొద్దని సూచించింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఏమైనా పనులుంటే ఉదయం 11 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత చూసుకోవాలని తెలిపారు. నిత్యం 5 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలని చెప్పారు.
News February 27, 2025
#WeStandWithPosani అంటున్న వైసీపీ శ్రేణులు

AP: కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తూ #WeStandWithPosani అని కార్యకర్తలు ట్వీట్లు చేస్తున్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిని అరెస్టు చేశారని, ఇప్పుడు నాయకులను టార్గెట్ చేశారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వైసీపీ నేతలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటుకు రూ.5వేలు?

TG: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నిన్న ఓటర్లకు పలువురు అభ్యర్థులు డబ్బులు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. కొందరు ఓటర్లకు పార్టీలు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖాతాల్లో డబ్బులు జమ అవుతుండడంపై నిఘా ఉందన్న ప్రచారంతో నేరుగా ఓటర్ల చేతికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమకు డబ్బులు రాలేవని కొందరు నిరాశ చెందుతుండటం గమనార్హం.