News October 9, 2024

ఆ అపాయింట్‌మెంట్ లెటర్లు ఫేక్: APPSC

image

AP: ఏపీపీఎస్సీ సభ్యుల ఆఫీస్‌ల నుంచి వచ్చే అపాయింట్‌మెంట్ లెటర్లు ఫేక్ అని ఏపీపీఎస్సీ తెలిపింది. అసలు ఏపీపీఎస్సీ మెంబర్లు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వరని స్పష్టం చేసింది. అపాయింట్‌మెంట్ లెటర్ల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చి మోసపోవద్దని సూచించింది. ప్రతి శాఖలో విధి విధానాలకు లోబడే నియామకాలు జరుగుతాయని పేర్కొంది.

Similar News

News March 24, 2026

స్కిప్పింగ్‌తో ఎన్నో లాభాలు

image

ప్రతిరోజు స్కిప్పింగ్​ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్కిప్పింగ్​ చేయడం వల్ల కండరాలు పటిష్ఠంగా మారతాయి. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. కాళ్లు, చేతులు, ఇతర అవయవాల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. తద్వారా బాడీ బ్యాలెన్స్ పెరుగుతుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చై బాడీ ఫిట్‌గా మారుతుంది. అంతేకాకుండా స్కిప్పింగ్​ చేయడం ద్వారా డోపమైన్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది.

News March 24, 2026

ఏప్రిల్ వరకు ‘ఉపాధి’.. APకి 4.40 కోట్ల పనిదినాలు

image

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీకి వచ్చే నెల కోసం 4.40 కోట్ల పనిదినాలను కేటాయించింది. కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకాన్ని మే 1 నుంచి ప్రారంభిస్తామని తెలిపింది. ఏప్రిల్ నుంచే ఆ స్కీమ్ అమలు చేయాల్సి ఉండగా విధివిధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో మరో నెల వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

News March 24, 2026

వార్ ఎఫెక్ట్.. రూ.48 లక్షల కోట్లు ఆవిరి

image

పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి(FEB 28) నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 8,590 పాయింట్లు(10.56శాతం), నిఫ్టీ 2,666 పాయింట్లు(10.58 శాతం) పడిపోయాయి. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఏకంగా రూ.48.29 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. BSE లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.463 లక్షల కోట్ల నుంచి రూ.415 లక్షల కోట్లకు పడిపోయింది.