News October 22, 2024
ఆ బ్లాంకెట్లు నెలకు ఒకసారే ఉతుకుతారు!

ట్రైన్స్లోని ఏసీ కోచుల్లో అందించే బ్లాంకెట్స్ను నెలకు ఒకసారి మాత్రమే ఉతుకుతారని ఆర్టీఐలో వెల్లడైంది. ఉన్ని దుప్పట్లను నెలకు ఒకసారి, కొన్నిసార్లు రెండుసార్లు అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు ఉతుకుతామని రైల్వే శాఖ RTI ద్వారా TNIEకి తెలిపింది. గరీబ్ రథ్, దురంతో వంటి రైళ్లలో దుప్పట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. దీంతో నిత్యం ప్రయాణికులు వాడేవాటిని ఉతక్కపోవడం ఏంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.
Similar News
News November 22, 2025
పరకామణి కేసు.. శ్రీనివాసులుకు భద్రత కల్పించండి: హైకోర్టు

AP: పరకామణి <<18290953>>కేసులో<<>> పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ దర్యాప్తు కోరుతూ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఫిర్యాదుదారు సతీశ్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే.
News November 22, 2025
తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో ఉండకూడదు: HC

తండ్రి పర్మిషన్ లేకుండా ఆయన ఇంట్లో కొడుకు ఉండటానికి వీల్లేదని రాజస్థాన్ హైకోర్టు తేల్చి చెప్పింది. సవాయ్ మాధోపూర్కు చెందిన ఖత్రీ, ఆయన కుమారుడికి మధ్య ఆస్తి వివాదంలో ఈ తీర్పిచ్చింది. తన బాగోగులు చూసుకోవడం లేదంటూ కొడుకు, కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఖత్రీ కోరారు. వివాదం పెద్దదై HCకి చేరింది. తానూ ఇంటి యజమానినేనంటూ కొడుకు వాదించాడు. తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఉండటానికి వీల్లేదని HC చెప్పింది.