News August 25, 2024
ఆ వ్యాఖ్యలు ప్రభాస్ పాత్రను ఉద్దేశించి అయ్యుండొచ్చు: పూనమ్ ధిల్లాన్

హీరో ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు చిత్రంలోని ప్రభాస్ పాత్రను ఉద్దేశించి మాత్రమే అయ్యుండొచ్చని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ సంఘం అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ అభిప్రాయపడ్డారు. ఒక ఆర్టిస్టుగా అర్షద్ వ్యాఖ్యలు కేవలం సినిమా పాత్రను మాత్రమే ఉద్దేశించి ఉండొచ్చని, ప్రభాస్‌పై వ్యక్తిగతంగా చేసినవి కాకపోవచ్చని నమ్ముతున్నానని అన్నారు. అయినా ఈ విషయమై అర్షద్ నుంచి వివరణ కోరతామన్నారు.
Similar News
News November 7, 2025
చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

పారా కాంపౌండ్ ఆర్చరీలో శీతల్ దేవి వరల్డ్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా అనేక పతకాలు గెలిచారు. ఆమె ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జెడ్డా వేదికగా జరగనున్న ఆసియా కప్ స్టేజ్-3లో పోటీ పడే భారత జట్టుకు ఎంపికయ్యారు. సాధారణ ఆర్చర్ల జట్టులోకి పారా ఆర్చర్ ఎంపికవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రయల్స్‌లో ఆమె ఓవరాల్‌గా 3వ స్థానంలో నిలిచారు.
News November 7, 2025
అరక అరిగిన గరిసె విరుగును

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.
News November 7, 2025
పెళ్లి ఏ వయస్సులో చేసుకోవాలి?

అమ్మాయిలు 18, అబ్బాయిలు 21 ఏళ్లు దాటాక వివాహం చేసుకోవాలని సనాతన ధర్మం బోధిస్తోంది. దీని వెనుక ఆధ్యాత్మిక ఆంతర్యం కూడా ఉంది. వివాహ జీవితం సక్రమంగా సాగాలంటే శారీరక బంధం ఉంటే సరిపోదు. మానసిక, ఆధ్యాత్మిక పరిణతి కూడా చెంది ఉండాలి. పూర్వం యువతీ యువకులు వేదాలనభ్యసించి, జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకునేవారట. ఇది ధర్మాన్ని నిలబెట్టి, మోక్ష మార్గానికి బాటలు వేస్తుందని నమ్మకం. <<-se>>#Sanathanam<<>>


