News May 26, 2024

ఆ దేశాలు మాల్దీవులను ఆదుకోవాలి: ముయిజ్జు

image

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మాల్దీవులు తీవ్రంగా నష్టపోతోందని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తెలిపారు. ధనిక దేశాలు తమ దేశాన్ని ఆదుకోవాలని కోరారు. ‘వాతావరణ మార్పుల వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో మా దేశం నీటిలో మునిగిపోయే ఆస్కారం ఉంది. దీని నుంచి రక్షించుకునేందుకు 500 మిలియన్ డాలర్లు అవసరం. ఇంత మొత్తాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారం’ అని SIDS సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 14, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్‌చెరు, లింగపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.

News January 14, 2026

ధోనీకే సాధ్యం కానిది.. రాహుల్ రికార్డు

image

భారత ప్లేయర్ KL రాహుల్ ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత సాధించారు. వన్డేల్లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. రాజ్‌కోట్ వేదికగా వన్డేల్లో శతకం చేసిన తొలి ఇండియన్ కూడా ఈయనే. ఓవరాల్‌గా రాహుల్‌కిది వన్డేల్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఏడాదిలో భారత్ తరఫున ఇదే తొలి అంతర్జాతీయ శతకం. సెంచరీ చేసిన సమయంలో తన కూతురుకు అంకితం ఇస్తున్నట్లుగా రాహుల్ సెలబ్రేట్ చేసుకున్నారు.

News January 14, 2026

మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

image

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్‌ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.