News September 15, 2025
ఆ పూలు పూజకు పనికిరావు!

పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ‘కింద పడిన, వాసన చూసిన, ఎడమ చేతితో కోసిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేత్తో, ధరించిన వస్త్రాలలో, జిల్లేడు/ఆముదం ఆకులలో తీసుకొచ్చిన పువ్వులను కూడా ఊపయోగించకూడదు’ అని చెబుతున్నారు. పూజలో పువ్వులను సమర్పించేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు మాత్రమే వాడాలి’ అని అంటున్నారు.
Similar News
News February 8, 2026
పాక్ ఏజెంట్‌తో గొగొయ్‌కి సంబంధాలు: CM

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్‌పై అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పాక్ ఏజెంట్ అలీ తౌఖీర్‌తో గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజబెత్(బ్రిటిష్ పౌరురాలు)కి సంబంధాలున్నాయి. 44పేజీల SIT నివేదిక ప్రకారం ఆమె కీలక సమాచారం పంచుకున్నట్లు ఉంది. పాక్‌కు చెందిన ఓ సంస్థ ఆమెకు జీతమిచ్చింది. గొగొయ్‌తో వివాహమయ్యాక ఆమె 9సార్లు పాక్ వెళ్లారు. గౌరవ్ కుటుంబంలో మరొకరు పాక్‌కు సహకరిస్తున్నారు’ అని ఆరోపించారు.
News February 8, 2026
‘సూపర్ హ్యూమన్స్’ని సృష్టించాలన్న ఎప్‌స్టీన్!

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఓ ‘సూపర్ హ్యూమన్ రేస్’ను సృష్టించాలని ప్రయత్నించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. “మరణానికి ముందు తన వింత కోరికను వెలిబుచ్చారు. తన DNAతో గొప్ప మేధస్సు కలిగిన పిల్లలను పుట్టించాలని కోరారు. గతంలోనూ న్యూమెక్సికోలోని తన పెద్ద పశువుల పాక(RANCH)లో మహిళలను గర్భవతులను చేయాలని శాస్త్రవేత్తలతో తరచూ చెప్పేవారు. కొందరు దానిని ‘BABY RANCH’ అని పిలిచేవారు” అని NYT పేర్కొంది.
News February 8, 2026
YS జగన్‌తో TVK విజయ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


