News October 25, 2025

ఇతర పదవుల్లో ఉండే వారికి DCC రాదు: PCC చీఫ్

image

TG: సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. మ.3కు అధిష్ఠానం CM, Dy.CMతో పాటు నా అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుంది. సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC ఇవ్వరాదనే నియమం ఉంది. అలాంటి వారికి ఈ పదవి రాదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 25, 2025

RO-KO షో.. రికార్డులు బద్దలు

image

* ODIల్లో మోస్ట్ 150+ పార్ట్‌నర్‌షిప్స్: సచిన్-గంగూలీ రికార్డు సమం చేసిన RO-KO(12)
* ODIs+T20Isలో అత్యధిక రన్స్ చేసిన కోహ్లీ(18,443*). సచిన్ రికార్డు బద్దలు(18,436)
* వన్డేల్లో సచిన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా కోహ్లీ(14,255*)
* 101 ఇన్నింగ్స్‌ల్లో 19సార్లు 100+ భాగస్వామ్యాలు నెలకొల్పిన RO-KO
* ఇంటర్నేషనల్ క్రికెట్లో హిట్‌మ్యాన్ 50* సెంచరీలు
* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్: రోహిత్

News October 25, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

News October 25, 2025

C-DACలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

image

<>C-DAC<<>> 7 ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంసీఏ/MSC/ME/MTECH ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు నవంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్ : https://www.cdac.in