News August 17, 2024
ఆ IPSలు బెంగళూరులో జగన్‌ను కలిశారు: వర్ల
AP: వీఆర్‌లో ఉన్న IPSలు బెంగళూరులో మాజీ CM జగన్‌ను కలిశారని TDP నేత వర్ల రామయ్య ఆరోపించారు. దీనిపై DGP విచారణ జరిపించాలని ఆయన కోరారు. ‘గత ప్రభుత్వ హయాంలో సీనియారిటీలో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని DGPగా నియమిస్తే ఎవరూ మాట్లాడలేదు. సంజయ్, సునీల్ కుమార్, PSR ఆంజనేయులు చరిత్ర ఐవైఆర్ కృష్ణారావు, స్వర్ణజిత్ సేన్‌కు తెలియదా? ఇప్పుడు మాట్లాడుతున్న వారందరికి అప్పుడేమైంది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News January 21, 2025
ఈ వారమే హిందీలో ’డాకు‘ రిలీజ్
బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఎమోషన్, సహజత్వం కొనసాగేలా ఇందులో కూడా తన రోల్‌కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బీటౌన్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
News January 21, 2025
లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా? ఇలా చేయండి!
TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.
News January 21, 2025
WEF: నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.