News February 18, 2025
సోషల్ మీడియా వాడకంలో వెనుకబడిన ఆ ఎమ్మెల్యేలు?

AP: సోషల్ మీడియా వాడకంలో 65మందికి పైగా TDP ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్నట్లు ఆ పార్టీ సమీక్షలో వెల్లడైనట్లు సమాచారం. సమీక్ష ప్రకారం.. ఆయా ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వాడకం అంతంతమాత్రంగానే ఉంది. ప్రజల్లోకి వెళ్లేందుకు సామాజిక మాధ్యమాలు చాలా శక్తిమంతమైనవని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నా ఆ నేతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. దీంతో అధినేత వారికి త్వరలో స్వయంగా క్లాస్ తీసుకుంటారని సమాచారం.
Similar News
News December 15, 2025
కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.
News December 15, 2025
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మృతి

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు రాబ్ రైనర్ (78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ (68) దారుణ హత్యకు గురయ్యారు. US లాస్ ఏంజెలిస్లోని వారి ఇంట్లో రక్తపుమడుగులో పడి కనిపించారు. సొంత కుమారుడే వారిని చంపారని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. నటుడిగా ఆయన రెండు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నారు. దర్శకుడిగా ‘When Harry Met Sally’, ‘Misery’, ‘A Few Good Men’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు.
News December 15, 2025
ఎంపీ, ఎమ్మెల్యేల సొంతూళ్లలో గెలుపెవరిదంటే?

TG: మహబూబ్నగర్ MP డీకే అరుణ(BJP), నారాయణపేట MLA చిట్టెం పర్ణికారెడ్డి(INC) పుట్టిన ఊరు ధన్వాడ. వరుసకు అత్తాకోడళ్లు అయ్యే వీరు సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ పోరులో INC బలపర్చిన చిట్టెం జ్యోతిపై BJP మద్దతుదారు జ్యోతి 617 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహబూబ్నగర్(D) దేవరకద్ర MLA మధుసూదన్ రెడ్డి స్వగ్రామం దమగ్నాపూర్లో BRS బలపర్చిన పావని కృష్ణయ్య 120 ఓట్లతో విజయం సాధించారు.


