News May 22, 2024

ఆ OBC సర్టిఫికెట్లు చెల్లవు: కలకత్తా హైకోర్టు

image

బెంగాల్‌లో 2010 తర్వాత మంజూరైన దాదాపు 5లక్షల OBC సర్టిఫికెట్లు చెల్లవని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పటికే లబ్ధి పొందుతున్నవారిపై ఈ తీర్పు ప్రభావం చూపించబోదని కోర్టు వివరించింది. ఈ OBC సర్టిఫికెట్లు WB బ్యాక్‌వర్డ్ క్లాస్ కమిషన్ చట్టానికి విరుద్ధంగా మంజూరైనట్లు దాఖలైన పిటిషన్‌‌పై కోర్టు ఇలా స్పందించింది. ఇదిలా ఉంటే.. ఈ తీర్పును అంగీకరించబోమని, ఇది BJP కుట్ర అని CM మమత ఆరోపించారు.

Similar News

News February 14, 2026

భారీ జీతంతో దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ 9 పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మాస్టర్‌ ఆఫ్ ఫారిన్ గోయింగ్ షిప్ సర్టిఫికెట్ కలిగినవారు మార్చి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నెలకు రూ.70,000-రూ. 2,00000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in

News February 14, 2026

టాపార్డర్ ఓకే.. వీళ్లు కూడా రాణిస్తే!

image

T20 WCలో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన టీ‌మ్ ఇండియాకు బ్యాటర్ల నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది. ఇషాన్, సూర్య, హార్దిక్ రాణిస్తున్నా మిడిలార్డర్‌లో తిలక్, దూబే, రింకూ, ఆల్‌రౌండర్ అక్షర్ ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఈ మ్యాచులోనైనా వీరు గాడిలో పడితే భారత్‌కు మరింత ప్రయోజనం చేకూరడంతో పాటు టాపార్డర్ మీద భారం తగ్గనుంది.

News February 14, 2026

అరటిలో పిలకల తొలగింపుతో అధిక దిగుబడి

image

అరటి పంట నాటిన 3-4 నెలల తర్వాత పిలకలు వృద్ధి చెందుతాయి. అరటి గెల సగం తయారయ్యే వరకు పిలకలను 20-25 రోజులకొకసారి కోసి వేయాలి. ఇలా చేయడం వల్ల తల్లి చెట్లు బలంగా ఎదిగి అధిక ఫలసాయం అందిస్తుంది. బాగా పెద్దవైన పిలకలను వెడల్పాటి పదునైన గునపంతో కొద్దిపాటి దుంపతో సహ తవ్వితీస్తే తిరిగి ఎదగదు. ఒకవేళ అరటిలో 2వ పంట తీసుకోవాలంటే తల్లి చెట్టుకు దూరంగా ఉన్న ఆరోగ్యవంతమైన పిలకను ఎన్నుకొని మిగతా వాటిని తీసివేయాలి.