News June 13, 2024
ఆ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలి: CM

AP: తనను కలిసేందుకు వచ్చిన IPS, IASలతో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు తనను బాధించిందన్నారు. ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదని, ఆ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. శాఖలవారీగా మరోసారి సమావేశం అవుతానని చెప్పారు. మరోవైపు సచివాలయం నుంచి ఇంటికి చేరుకున్న సీఎం మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపు ప్రకటన చేసే అవకాశం ఉంది.
Similar News
News September 15, 2025
నేడు స్థానిక ఎన్నికలపై సీఎం సమావేశం

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సీఎం రేవంత్ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం, ఉత్తమ్ పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అటు హైకోర్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నందున ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
News September 15, 2025
పవర్‌గ్రిడ్‌లో 866 అప్రంటిస్‌లు.. AP, TGలో ఎన్నంటే?

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 866 అప్రంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. పోస్టులను బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG చేసి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. పోస్టును అనుసరించి స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. అక్టోబర్ 6లోగా powergrid.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.
News September 15, 2025
ITR ఫైలింగ్ గడువు పొడిగింపు లేదు: IT శాఖ

ITR ఫైలింగ్‌కు గడువు పొడిగించలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఐటీ విభాగం నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు చూసుకోవాలని తెలిపారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ. ఇప్పటివరకు దాదాపు 6 కోట్లకుపైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేశారు.