News October 25, 2024

పుస్తకాల బరువుతో పిల్లల్లో ఆ సమస్యలు!

image

పుస్తకాల బ్యాగుల రూపంలో పిల్లల నడుముపై భారాన్ని వేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యుడు సమీర్ రూపారెల్ పేర్కొన్నారు. ‘బ్యాగుల బరువు వల్ల ప్రతి 10మందిలో 8మంది చిన్నారులకి వెన్ను సమస్యలు వస్తున్నాయి. బ్యాగుల బరువు వారి శరీర బరువులో 15శాతాన్ని మించకూడదు. అధిక బరువు వల్ల మెడ, భుజాల నొప్పులు, వెన్ను వంగిపోయే స్కోలియోసిస్ వంటి పరిస్థితులూ తలెత్తవచ్చు’ అని హెచ్చరించారు.

Similar News

News October 25, 2024

పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు తమ దరఖాస్తులను డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో అందించాలని తెలిపింది. జిల్లాల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ నవంబర్ 13లోపు పూర్తి చేస్తామని, 20వ తేదీలోగా ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తామంది. పూర్తి వివరాలకు TGPMB వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

News October 25, 2024

26 నుంచి సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం

image

TG: నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 26 నుంచి నాగర్ కర్నూలు(D) సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్(M) సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు. నల్లమల అందాలను తిలకిస్తూ ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.

News October 25, 2024

ఎన్టీపీసీ లాభాల్లో జోష్

image

ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ APR-SEP త్రైమాసికంలో రూ.5,380.25 కోట్ల లాభాలను ఆర్జించింది. 2023-24లో ఇది రూ.4,726 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో గతేడాదితో పోలిస్తే తగ్గుదల నమోదైంది. రూ.45,384.64 కోట్ల నుంచి రూ.45,197.77 కోట్లకు తగ్గింది. స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 బి.యూనిట్లకు తగ్గగా, క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 5.09 MMT నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది.