News February 3, 2025
ఫిబ్రవరి 14న ఆ స్కూళ్లకు సెలవు

TG: షబ్-ఎ-బరాత్(ముస్లింలకు పవిత్రమైన రాత్రి) సందర్భంగా ప్రభుత్వం ఫిబ్రవరి 14న సెలవు ప్రకటించింది. నెలవంక కనిపించడంతో ఆ రోజున షబ్-ఎ-బరాత్ నిర్వహించాలని మతపెద్దలు ఖరారు చేశారు. అయితే ఇది సాధారణ సెలవుదినం కాకుండా ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది. ఫిబ్రవరి 14న కొన్ని పాఠశాలలకు సెలవు ఉండగా మరికొన్ని మైనారిటీ స్కూళ్లు మరుసటి రోజు సెలవు పాటిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే వర్తించనుంది.
Similar News
News November 22, 2025
విభూతి మహిమ

ఓనాడు ఓ విదేశీయుడు శివాలయం వద్ద 2 విభూది ప్యాకెట్లు కొన్నాడు. వాటిని అమ్మే బాలుడితో దాని ఎక్స్పైరీ డేట్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ‘విభూతికి ఏ గడువూ ఉండదు. దీన్ని మీరు రోజూ నుదిటిపై ధరిస్తే మీ ఎక్స్పైరీ డేట్ పెరుగుతుంది’ అని జవాబిచ్చాడు. సాక్షాత్తూ ఆ శివుడి ప్రసాదం అయిన విభూతికి నిజంగానే అంత శక్తి ఉందని నమ్ముతారు. విభూతి ధరిస్తే.. శివుని కృపకు పాత్రులవుతారని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.
News November 22, 2025
Al Falah: వందల మంది విద్యార్థుల భవిష్యత్తేంటి?

ఢిల్లీ పేలుడు <<18325633>>ఉగ్ర మూలాలు<<>> అల్ ఫలాహ్ వర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వందల మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వర్సిటీ, కాలేజీల గుర్తింపులు రద్దయితే అంతా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కెరీర్, NEET కష్టం, ₹లక్షల ఫీజులు వృథా అవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఎక్కడా నమ్మరని బాధపడుతున్నారు.
News November 22, 2025
సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్లో ఎందుకు బ్యాటింగ్కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?


