News December 30, 2024

2 నెలలు ఆ రైళ్లు బంద్

image

AP: కుంభమేళాకు రైళ్లను మళ్లించడంతో పలు సర్వీసులను మార్చి 1 వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తిరుపతి- కదరిదేవరపల్లి ప్యాసింజర్, గుంతకల్- తిరుపతి ప్యాసింజర్, తిరుపతి- హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌పెస్‌లను 2 నెలలు నిలిపేశారు. వీటితో పాటు తిరుపతి- కడప మీదుగా ధర్మవరం మార్గంలో నడిచే 6 రైళ్లను రద్దు చేశారని, రైల్వే బోర్డు ప్రత్యామ్నాయం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Similar News

News February 5, 2025

రేపు ఢిల్లీకి కేటీఆర్ బృందం!

image

TG: ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ నేపథ్యంలో రేపు ఢిల్లీకి KTR బృందం వెళ్లనుంది. 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో వారు చర్చించనున్నారు. కేటీఆర్ వెంట వినోద్, దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లనున్నారు. కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో చర్యలకు ఎంత సమయం తీసుకుంటారని సుప్రీం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ సెక్రటరీ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

News February 5, 2025

విదేశాలకు 47% పెరిగిన పళ్లు, కూరగాయల ఎగుమతులు

image

APEDA ఆర్థిక సహకారంతో గత ఐదేళ్లలో భారత్ నుంచి పళ్లు, కూరగాయాల ఎగుమతులు 47.3% పెరిగాయని కామర్స్ మినిస్ట్రీ తెలిపింది. విలువ పరంగా ఈ వృద్ధిరేటు 41.5% అని పేర్కొంది. FY 2023-24లో 123 దేశాలకు ఎగుమతులు చేరాయని వెల్లడించింది. రైతుల కోసం Intl ట్రేడ్ ఫెయిర్స్‌లో పాల్గొనడం, బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ ఏర్పాటు, మార్కెట్ యాక్సెస్‌తో ఇది సాధ్యమైందని వివరించింది. గత మూడేళ్లలో 17 కొత్త మార్కెట్లలో ప్రవేశించామంది.

News February 5, 2025

JF కెనడీ భార్యపైనే నెహ్రూకు మరింత ఆసక్తి: Forgotten Crisis బుక్

image

ఫారిన్ పాలసీపై ఆసక్తి ఉన్న, అర్థం చేసుకోవాలనుకున్న, భవిష్యత్తులో ఏదైనా చేయాలనుకునే వారు JFK’s Forgotten Crisis బుక్ చదవాలని రాహుల్‌ను ఉద్దేశించి మోదీ నిన్న సూచించారు. ఫారిన్ పాలసీ పేరుతో 1962లో ఆడిన ఆట గురించి బాగా తెలుస్తుందంటూ సెటైర్ వేశారు. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన తనతో కాకుండా తన భార్య జాకీ, సోదరి జాక్/బాబీతో మాట్లాడేందుకే నెహ్రూ మరింత ఆసక్తి చూపినట్టు JF కెనడీ పేర్కొన్నట్టు అందులో ఉంది.

error: Content is protected !!