News July 29, 2024

ఆ గిరిజనులు చాలా గ్రేట్: ప్రధాని మోదీ

image

APలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులను ప్రధాని మోదీ అభినందించారు. పులుల ఆనవాళ్లను కనిపెట్టడంలో వారు చేస్తున్న సేవల గురించి ఎవరైనా వింటే ఆశ్చర్యపోతారని మన్‌కీబాత్‌లో వెల్లడించారు. టైగర్ ట్రాకర్స్‌గా వారు పనిచేస్తున్నారని, వన్యప్రాణుల ప్రతి చిన్న కదలికలను సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే అటవీ ప్రాంతంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపైనా నిఘా ఉంచినట్లు మోదీ వివరించారు.

Similar News

News November 12, 2025

ఢిల్లీ బ్లాస్ట్‌‌కు టెలిగ్రామ్‌తో లింక్!

image

ఢిల్లీ బ్లాస్ట్‌లో కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా రాడికల్ డాక్టర్లు గ్రూపుగా ఏర్పడి సమాచారాన్ని చేరవేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ యాప్‌పై ఎప్పటినుంచో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. కంటెంట్ నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ యాప్ బ్యాన్ చేయాలనే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.

News November 12, 2025

‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

image

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.

News November 12, 2025

18 రోజులు.. ఈసారి మహాభారతమే

image

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.