News July 12, 2024
ఏపీలో ఆ రెండు రోజులు భారీ వర్షాలు

ఆవర్తన ప్రభావంతో APలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు మన్యం, అల్లూరి, ఉభయగోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయంది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Similar News
News December 9, 2025
రాజధానిలో గ్రామకంఠాల సర్వే.. 13 బృందాలు రంగంలోకి

రాజధాని 29 గ్రామాల్లో గ్రామకంఠాల గందరగోళానికి చెక్ పెట్టేందుకు CRDA 13 సర్వే బృందాలను రంగంలోకి దించింది.
రైతులు మినహాయింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చి త్వరలో గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. నివేదికలు అందిన తర్వాత మినహాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
News December 9, 2025
క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

విండీస్ ఆల్రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.
News December 9, 2025
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.


