News June 4, 2024
ఓటమి బాటలో ఆ ఇద్దరు మంత్రులు?

AP: ప్రకాశం జిల్లాలో ఇద్దరు YCP మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)తోపాటు మంత్రులు ఆదిమూలపు సురేశ్ (కొండపి), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు)కు ఓటమి తప్పేలా లేదు. ఎన్నికల కౌంటింగ్‌లో వీరందరూ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు ఒంగోలులో దామచర్ల 14 వేలకుపైగా, కొండపిలో స్వామి 12 వేలకుపైగా, సంతనూతలపాడులో విజయ్ కుమార్ దాదాపు 30 వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.
Similar News
News January 30, 2026
కేజిన్నర బంగారం.. 8.7 కేజీల వెండి.. రెవెన్యూ ఉద్యోగి ఆస్తుల చిట్టా!

AP: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి తిరుమలేశ్ను ACB అరెస్టు చేసింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేశారు. 11 ఆస్తి పత్రాలు, 1.47KGs బంగారం, 8.77KGs వెండి, ₹15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆరోపణల నేపథ్యంలో 2025 అక్టోబర్‌లో అతడు సస్పెండైనట్లు తెలుస్తోంది.
News January 30, 2026
కేసీఆర్‌ను ఏమీ పీకలేరు: జగదీశ్ రెడ్డి

TG: ఎన్ని నోటీసులు ఇచ్చినా కేసీఆర్‌ను ఏమీ పీకలేరని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో BRS నేతలను డిస్టర్బ్ చేసేందుకే తమ అధినేతకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. KTR, హరీశ్ రావులకు నోటీసులు ఇస్తే ఎంత మంది తరలివచ్చారో చూశారని వ్యాఖ్యానించారు. అదే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎన్నికలను పక్కనబెట్టి మరీ లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తారని ప్రభుత్వానికి తెలుసన్నారు.
News January 29, 2026
క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

క్యాన్సర్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా CM చంద్రబాబు AP క్యాన్సర్ అట్లాస్ విడుదల చేశారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి రూపొందించిన ఈ అట్లాస్ ద్వారా రాష్ట్రంలోని 2.9 కోట్ల మంది స్క్రీనింగ్ వివరాలను మ్యాపింగ్ చేశారు. దేశంలోనే తొలిసారి క్యాన్సర్‌ను Notifiable Diseaseగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2030 నాటికి కేసులను తగ్గించడమే లక్ష్యంగా విలేజ్ లెవల్ నుంచే ట్రీట్మెంట్ అందేలా ప్లాన్ చేశారు.


