News June 4, 2024

బీజేపీని నిలబెట్టిన ఆ రెండు రాష్ట్రాలు!

image

నువ్వా-నేనా అన్న‌ట్టు సాగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎన్డీయే మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌డం వెనుక గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు కీల‌క‌పాత్ర పోషించాయి. గుజ‌రాత్‌లోని 25 స్థానాల్లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని 29 స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ద్వారా సొంతంగా 238 సీట్లు సాధించ‌గ‌లిగింది. ఈ రెండు రాష్ట్రాలే ఇప్పుడు ఎన్డీయేని మ‌ళ్లీ అధికారానికి చేరువ చేశాయి. 2019 ఫ‌లితాలే ఇక్క‌డ పున‌రావృతమ‌య్యాయి.

Similar News

News January 7, 2026

కవిత రాజీనామాకు ఆమోదం

image

TG: కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2025 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. నిన్న మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

News January 7, 2026

స్మిత్ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు

image

యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 5,085 రన్స్ చేశారు. తర్వాతి స్థానాల్లో బ్రాడ్‌మాన్(AUS-5,028), బోర్డర్(AUS-4,850) ఉన్నారు. మరోవైపు అత్యధిక శతకాల జాబితాలో సచిన్(51), కల్లిస్(45), పాంటింగ్(41), రూట్(41), సంగక్కర(38) తర్వాతి స్థానంలో స్మిత్(37) ఉన్నారు.

News January 7, 2026

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సెషన్లో సభ 13 బిల్లులు, 2 తీర్మానాలను ఆమోదించింది. 5 రోజుల్లో 40 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీ జరిగింది. ఈ సమావేశాల్లో కృష్ణా జలాలపై చర్చ జరగ్గా ప్రధాన ప్రతిపక్షం BRS దూరంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తొలిరోజు సంతకం చేసి వెళ్లిపోయారు. తిరిగి సభకు హాజరుకాలేదు.