News April 28, 2024

నా కెరీర్‌లో అవి చీకటి రోజులు: ప్రియాంకా చోప్రా

image

హాలీవుడ్‌కు వెళ్లిన తొలి దశలో చీకటి రోజులు అనుభవించానని స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ‘హాలీవుడ్‌కు వెళ్లినప్పుడు చాలా భయం వేసింది. నాకు తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీలయ్యా. అది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఇండియాలో నేను స్టార్ హీరోయిన్ అయినా అక్కడ మళ్లీ మొదట్నుంచి కెరీర్ స్టార్ట్ అయినట్లు అనిపించింది. ఆ తర్వాత నా పని నేను చేసుకుంటూ సక్సెస్ అయ్యా’ అని ఆమె చెప్పారు.

Similar News

News November 17, 2024

గొర్రెలు కాస్తున్న స్టార్ హీరో కుమారుడు..!

image

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ స్టార్ డమ్‌ను కాదనుకుని చిన్నాచితక జీవితం గడిపేస్తున్నారు. స్పెయిన్‌లోని ఓ ఫామ్‌లో గొర్రెలు కాస్తున్నారు. యజమాని పెట్టేదే తింటూ అక్కడే నిద్రపోతున్నారు. డబ్బు, హోదా కంటే చిరకాల అనుభవాలకే ఆయన విలువిస్తారు. కాగా ప్రణవ్ ‘పునర్జని’ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటుడి అవార్డు అందుకున్నారు. ‘ఆది’ చిత్రంతో హీరోగా రీఎంట్రీ ఇచ్చారు.

News November 17, 2024

షమీపై సంచలన ఆరోపణలు!

image

భారత బౌలర్ మహ్మద్ షమీ వయసుపై మోహన్ కృష్ణ అనే నెటిజన్ సంచలన ఆరోపణలు చేశారు. అతడి వయసు ప్రస్తుతం 42 ఏళ్లు కాగా, 34 ఏళ్లంటూ బోర్డును మోసగిస్తున్నారని ఆరోపించారు. షమీకి చెందినదిగా చెబుతున్న ఓ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేశారు. బీసీసీఐ దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ బోర్డును ట్యాగ్ చేశారు. అయితే అది ఫేక్ కావొచ్చంటూ షమీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తుండటం గమనార్హం.

News November 17, 2024

తమిళనాడులో టాటాకు చెందిన ఐఫోన్ ఫ్యాక్టరీ

image

తమిళనాడులో ఐఫోన్ ప్లాంట్ కోసం తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌తో టాటా సీల్స్ ఒప్పందం చేసుకుంది. ఐఫోన్ ప్లాంట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్ అంగీకరించింది. 10,000 మంది ఉద్యోగులున్న ఈ ప్లాంట్‌లో టాటా 60% & పెగట్రాన్ 40% వాటాను కలిగి ఉన్నాయి. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 5 మిలియన్ ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో టాటాకు చెందిన మూడో ఐఫోన్ ఫ్యాక్టరీ ఇది.