News July 16, 2024
ఫేక్ సర్టిఫికెట్స్‌తో వచ్చిన వారిని ఏరివేయాలి: స్మితా సబర్వాల్

ట్రెయినీ IAS పూజా ఖేద్కర్ వ్యవహారంపై IAS స్మితా సబర్వాల్ స్పందించారు. ‘సివిల్ సర్వీసెస్‌లోకి వచ్చేందుకు కొందరు ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించారనే వార్తలు ఆందోళనకరం. చాలా మంది తెలివైన విద్యార్థులు IAS, IPS కావడం వారి గమ్యస్థానంగా పరిగణిస్తారు. మెరిట్ ద్వారానే వారు దానిని చేరుకోగలరు. సమగ్ర విచారణ జరిపి ఇలాంటి మోసగాళ్లను ఏరివేయాలి. రిజర్వేషన్/ కోటాల విషయంలో వ్యవస్థలో మార్పులు అవసరం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 23, 2026
మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

AP: వచ్చే మూడేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం. ఇప్పటికే రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. విశాఖ, అమరావతి, తిరుపతిని 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. భోగాపురం విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జులైలో ప్రారంభిస్తాం. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుంది’ అని పేర్కొన్నారు.
News March 23, 2026
OFFICIAL: సామ్ కరన్ స్థానంలో శనక

IPL-2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనక(రూ.2కోట్లు)ను ఎంపిక చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆయన శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 3350కి పైగా రన్స్, 86 వికెట్లు సాధించారు.
News March 23, 2026
ఎక్స్పైరీ పేరిట రూ.40 కోట్ల మందులు మాయం!

TG: పేద రోగులకోసం వినియోగించాల్సిన ₹40 కోట్ల విలువైన మెడిసిన్స్ పక్కదారి పట్టినట్లు సమాచారం. హాస్పిటల్స్‌కు పంపిణీ చేసే ప్రధాన కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపి బయటి షాపులకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. క్యాన్సర్ వంటి రోగాలకు వాడే మందులూ ఇలా పక్కదారి పడుతున్నాయని కనుగొంది. విచారణలో స్టోర్ కీపర్ల వాంగ్మూలాలు నమోదు చేసింది. దీనిపై నివేదిక(H&FW/VIG/40CR-MED) రెడీ చేసింది.


