News September 16, 2024
రాహుల్ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలిస్తా: శివసేన ఎమ్మెల్యే

షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద ప్రకటన చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థకు ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చినవారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఒకవైపు రిజర్వేషన్లు పెంచాలని చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దీంతో ఆయన నిజం రూపం ఏంటో బయటపడిందన్నారు. అయితే సంజయ్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంది.
Similar News
News December 5, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00
News December 5, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి లైఫ్ సైన్స్ /బయో టెక్నాలజీ/కెమికల్ /కంప్యూటేషనల్ & ఇన్ఫర్మేషన్ /ఫార్మాస్యూటికల్/వెటర్నరీ విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nii.res.in
News December 5, 2025
అందుకే IPLకు గుడ్‌బై చెప్పా: ఆండ్రీ రస్సెల్

వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ IPLకు <<18429844>>గుడ్‌బై<<>> చెప్పిన కారణాన్ని తాజాగా వెల్లడించారు. “ఐపీఎల్ ప్రపంచంలోనే అతి పెద్ద టోర్నీ. ప్రయాణాలు, వరుస మ్యాచ్‌లు, ప్రాక్టీస్, జిమ్ వర్క్‌లోడ్ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం సవాలుతో కూడుకున్నది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నేను ప్రభావం చూపాలి. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు” అని తెలిపారు.


