News October 7, 2025
తెలిసినవారే.. తెగిస్తున్నారు..

అత్యాచార ఘటనల్లో 98 శాతానికి పైగా నిందితులు బాధితురాళ్లకు పరిచయస్థులేనని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీరిలో ఆన్‌లైన్ వేదికల ద్వారా పరిచయమైనవారే ఎక్కువ మంది. చాలా ఘటనల్లో ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు, యజమానులు నిందితులు కాగా, కొన్ని కేసుల్లో మాత్రం కుటుంబసభ్యులే అకృత్యాలకు పాల్పడ్డట్లు రికార్డులు సూచిస్తున్నాయి. కాబట్టి అమ్మాయిలు తెలిసినవారైనాసరే అప్రమత్తంగా ఉండటం మంచిది.
Similar News
News March 25, 2026
సంగారెడ్డి: ఈనెల 30న జిల్లాస్థాయి ఎంపికలు.. వాళ్లే అర్హులు

తెలంగాణలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఈనెల 30న జిల్లా స్థాయి ఎంపికలు జరగనున్నాయి. సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మైదానంలో ఉదయం 10 గంటలకు ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన బాలబాలికలు మాత్రమే ఈ ఎంపికలకు హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.
News March 25, 2026
అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది.
News March 25, 2026
రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్‌కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.


