News June 20, 2024

వైసీపీకి ఓటేసినవారు విచక్షణతో ఆలోచించాలి: చంద్రబాబు

image

AP: వైసీపీకి ఓట్లేసి మద్దతు పలికిన వారు ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు కోరారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వారు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అని విచక్షణతో ఆలోచించాలి’ అని సూచించారు. జగన్ విధ్వంసం భరించలేమని ఇతర రాష్ట్రాల్లో పనులు చేసే వారు సైతం వచ్చి ఓటు వేశారని అన్నారు.

Similar News

News April 8, 2026

విశాఖ: మొదటి నుంచి వివాదాలే..!

image

దేవదాయ శాఖ ఏసీ శాంతిని ACB అధికారులు అరెస్ట్ చేశారు. 2020లో విశాఖలో పోస్టింగ్ తర్వాత డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్‌పై ఇసుక, మట్టితో దాడి చేసి వార్తల్లో నిలిచారు. అనంతరం అధికార దుర్వినియోగం ఆరోపణలతో విజయవాడకు బదిలీ అయ్యారు. 2024లో ఆమె భర్త చేసిన ఫిర్యాదులపై విచారణ జరగ్గా సస్పెండ్ అయ్యారు. కోర్టు ఆదేశాలతో తిరిగి విధుల్లోకి వచ్చిన శాంతి తాజాగా ACB దాడుల్లో అరెస్టు కావడంతో కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.

News April 8, 2026

సీజ్‌ఫైర్.. భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!

image

కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 15 శాతం పడిపోయి 92.67 డాలర్లకు దిగివచ్చింది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఏకంగా 20 డాలర్లు తగ్గి 94.87కు పడిపోయింది. మరోవైపు వరుస నష్టాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభపడే అవకాశం ఉంది.

News April 8, 2026

త్వరలోనే పంచాయతీ ఎన్నికలు.. హైకోర్టుకు ఏజీ రిపోర్ట్!

image

AP: స్థానిక సంస్థలు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. వారం రోజుల్లో SEC నియామకం, 10 రోజుల్లో BC జనాభా లెక్కింపు పూర్తవుతాయన్నారు. BC రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఎన్నికలపై దాఖలైన పిటిషన్ల విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది.