News July 15, 2024
చనిపోయానని అనుకున్నా: ట్రంప్

నిన్నటి కాల్పుల <<13624982>>ఘటనలో<<>> తాను చనిపోయానని అనుకున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో చెప్పారు. ఇదొక విచిత్ర పరిస్థితి అని తెలిపారు. గాయం నుంచి కోలుకుంటున్న ఆయన తిరిగి ప్రచారానికి సిద్ధమయ్యారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన కుడి చెవికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ట్రంప్ విజయావకాశాలు పెరిగాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 28, 2025
జనవరి 1న లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ

2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఆరోజు అందరం లొంగిపోతామని MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని కేంద్రానికి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది.
News November 28, 2025
NIEPVDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 28, 2025
స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్‌వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


