News July 22, 2024
భారత్కు ‘సంతానలేమి’ ముప్పు?

భారత్ ‘సంతానలేమి’ ముప్పును ఎదుర్కోనుందని ‘ఇందిరా ఐవీఎఫ్’ వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్డియా ఆందోళన వ్యక్తం చేశారు. మరి కొన్నేళ్లలో దేశ జనాభా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని హెచ్చరించారు. హార్మోన్ల సమస్యలు, మితిమీరిన ఔషధ వినియోగం, పేలవమైన జీవనశైలి కారణంగా ఈ సమస్య జటిలమైందన్నారు. దీని వల్ల యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని.. ఆర్థికంగానూ ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


