News June 28, 2024

ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకపోతే?

image

భారత్-సౌతాఫ్రికా మధ్య రేపు రా.8 గంటలకు ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ జరిగే బ్రిడ్జ్‌టౌన్‌లో రేపు వర్షం పడే అవకాశం 70% ఉన్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం ఏర్పడినా ఇబ్బంది లేదు. ఫైనల్‌కు రిజర్వ్‌డే ఉంటుంది. శనివారం మ్యాచ్ జరగకపోతే ఆదివారం నిర్వహిస్తారు. ఆరోజు కూడా వర్షం పడి ఆట సాధ్యం కాకపోతే IND, SAను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక ఫైనల్‌కు గఫానీ, ఇల్లింగ్‌వర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు.

Similar News

News December 10, 2025

ప్రపంచంలోనే అతి పొడవైన హైవే ఇదే..!

image

ప్రపంచంలోకెల్లా అతి పొడవైన రహదారి ‘పాన్-అమెరికన్’ హైవే అని మీకు తెలుసా? దీని పొడవు దాదాపు 30,000 కిలోమీటర్లు. ఇది అలాస్కాలోని ప్రుడో బే నుంచి మొదలై ఎలాంటి యూటర్న్ లేకుండా 14 దేశాల గుండా అర్జెంటీనా వరకు విస్తరించి ఉంది. ఈ రహదారి మెక్సికో, పనామా, కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలను కలుపుతుంది. వర్షారణ్యాలు, ఎడారులను దాటే ఈ మార్గంలో ప్రయాణం పూర్తి చేయడానికి సగటున 60 రోజులు పడుతుంది.

News December 10, 2025

అఖండ-2 టికెట్ రేట్లు భారీగా పెంపు

image

అఖండ-2 సినిమా టికెట్ల పెంపునకు TG ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా రేపు రా.8 గంటల ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. ఈ నెల 12 నుంచి 14 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100 చొప్పున, సింగిల్ స్క్రీన్లలో రూ.50 చొప్పున టికెట్ రేట్ పెంచుకోవచ్చని పేర్కొంది. కాగా అఖండ-2 టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం <<18519580>>ఇప్పటికే<<>> అనుమతి ఇచ్చింది.

News December 10, 2025

గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

image

హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల వైరస్‌ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.