News February 12, 2025

ప్రధానికి బెదిరింపు కాల్

image

PM మోదీ టార్గెట్‌గా బెదిరింపు కాల్ వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారమివ్వడంతో కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిగా గుర్తించారు. మోదీ పర్యటనకు ముందే ఈ కాల్ వచ్చినట్లు తెలిపారు.

Similar News

News February 12, 2025

సిక్కుల ఊచకోత: కాంగ్రెస్ మాజీ ఎంపీని దోషిగా తేల్చిన కోర్టు

image

1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు దోషిగా నిర్ధారించింది. అదే ఏడాది, నవంబర్ 1న ఢిల్లీలోని సరస్వతీ విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకులను తగలబెట్టిన కేసులో ఆయనను ముద్దాయిగా తేల్చింది. శిక్షను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 18న వాదనలు విననుంది. కాగా ఢిల్లీ కంటోన్మెంట్‌లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ ప్రస్తుతం జీవితఖైదు అనుభవిస్తున్నారు.

News February 12, 2025

విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సచిన్ 3990 పరుగులతో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 545 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన కోహ్లీ 27వేలకు పైగా పరుగులు చేశారు.

News February 12, 2025

MF: JANలో రూ.40వేల కోట్ల పెట్టుబడులు

image

స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్లు అధికంగా ఉన్నాయంటూ వార్నింగ్ ఇస్తున్నా ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లపై నమ్మకం ఉంచారు. JANలో MFలో రూ.39,687 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. స్మాల్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు 22.6% పెరిగి రూ.5,720CRతో రికార్డు గరిష్ఠానికి చేరాయి. మిడ్‌క్యాప్‌లో రూ.5147 CR, లార్జ్‌క్యాప్‌లో రూ.3,063 CR కుమ్మరించారు. 5 నెలలుగా మార్కెట్ పడుతున్నా క్రమశిక్షణ కనబరుస్తున్నారు.

error: Content is protected !!