News November 13, 2024
హీరోయిన్కు బెదిరింపులు: రూ.50 లక్షలు ఇవ్వాలంటూ..

హీరోయిన్ అక్షర సింగ్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 2 రోజుల్లో రూ.50 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని ఆగంతకుడు ఆమెను బెదిరించాడు. దీనిపై ఆమె పట్నాలోని దానాపుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా భోజ్పురి క్వీన్గా పిలుచుకునే అక్షర సింగ్ పలు సినిమాల్లో నటించారు. త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 27, 2025
కొత్త జిల్లాల ఏర్పాటు.. ఈ నెల 31న తుది నోటిఫికేషన్!

AP: జిల్లాలు, డివిజన్ల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రైమరీ <<18386076>>నోటిఫికేషన్<<>> రిలీజ్ చేసిన ప్రభుత్వం నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. నేటితో గడువు ముగుస్తుండటంతో మార్పులు, చేర్పులపై మంత్రులు, అధికారులతో CM చర్చించారు. మొత్తం 927 అభ్యంతరాలు రాగా వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఈ నెల 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది.
News December 27, 2025
పిల్లలకు జ్వరంతో పాటు ఫిట్స్ వస్తుంటే..

ఆరు నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలో జ్వరంతో పాటు కొందరికి ఫిట్స్ వస్తుంది. రోజులో రెండు, మూడు సార్లు వస్తే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఫిట్స్ ఉంటే అదీ పిల్లలకు వంశపారపర్యంగా వస్తుంది. జ్వరంతోపాటు తలనొప్పి, వాంతులు, చురుకుగా ఉండకపోవడం, బీపీ తగ్గిన సమయంలో ఫిట్స్ వస్తే మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మెదడువాపు వ్యాధి లక్షణాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
News December 27, 2025
₹240 కోట్లతో బాలామృతం.. నాణ్యత లోపిస్తే నష్టం

AP: 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు బాలామృతం కింద ₹240 CRతో న్యూట్రిషన్ పౌడర్, హెల్త్ మిక్స్ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు టెండర్లు పిలిచింది. పసివారికిచ్చే ఇవి నాణ్యతగా ఉండాలి. లేకుంటే దుష్ప్రభావం చూపుతాయి. అందుకే అనుభవమున్న కంపెనీలకే దీన్ని అప్పగించాలి. అయితే రాగి పిండి, చిక్కీలు తయారీ చేసే సంస్థలకు ఇచ్చేలా రూల్ మార్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు ‘TG ఫుడ్స్’ పౌడర్ ఇస్తున్నారు.


