News September 8, 2024

చంపేస్తామంటూ బజరంగ్ పునియాకు బెదిరింపులు

image

కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియాను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. ఓ ఫారిన్ నంబర్‌ నుంచి వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వినేశ్ ఫొగట్‌తో పాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా ఆ పార్టీ నియమించింది.

Similar News

News January 15, 2026

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

News January 15, 2026

NI-MSMEలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(NI-MSME) 2 కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ, BCom,MCom,CA,CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ recruitment@nimsme.gov.in ద్వారా అభ్యర్థులు జనవరి 30 వరకు అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.nimsme.gov.in/

News January 15, 2026

‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

image

నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీకి తొలి రోజు వచ్చిన కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ.22కోట్ల గ్రాస్ సాధించినట్లు ‘ఇంటిల్లిపాది నవ్వుల సునామీ’ పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. నవీన్ కెరీర్‌లో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇదే అత్యధికం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిన్న రిలీజైన మూవీ కామెడీ ఇష్టపడే ఆడియన్స్‌ను అలరిస్తోంది.