News July 19, 2024

నన్ను హతమారుస్తామని బెదిరింపులు: అసదుద్దీన్

image

TG: తనను హతమారుస్తామని SMSలు, ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీలో తనపై కాల్పులు జరిపిన దుండగులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే యత్నం చేస్తున్నారన్నారు.

Similar News

News December 27, 2025

చలికాలంలో స్కిన్ గ్లో అవ్వాలంటే

image

చలికాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి. చర్మంలోని తేమ తగ్గి ముఖం కాంతి విహీనంగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొబ్బరి నూనె, తేనె, అలోవెరా జెల్, రోజ్ వాటర్, మాయిశ్చరైజర్ తరచూ రాసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రాసుకోవడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. అలాగే షియా బటర్, గ్లిజరిన్, హైలురానిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లు మంచివని చెబుతున్నారు.

News December 27, 2025

ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

1. బియ్యం: పాపాలు తొలుగుతాయి.
2. ప౦డ్లు:బుద్ధి, సిద్ధి కలుగుతాయి.
3. పెరుగు:ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది.
4. నెయ్యి:రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
5. పాలు:నిద్ర లేమి సమస్య ఉండదు.
6. తేనె: స౦తానం కలుగుతుంది.
7. ఊసిరికాయలు: జ్ఞాపకశక్తి పెరుగుతు౦ది.
8. టె౦కాయ: అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది.
9. దీపదానం: క౦టి చూపు మెరుగు పడుతుంది.
10. వస్త్రదానం: ఆయుష్షు
11. అన్న దానం: ధనవృద్ధి పెరుగుతుంది.

News December 27, 2025

అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

image

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.