News October 30, 2024
సల్మాన్‌ను చంపేస్తానని బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2Cr ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తానని ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు బాంద్రాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తరచూ సల్మాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. అయితే తాజాగా పట్టుబడిన నిందితుడికి ఆ గ్యాంగ్‌తో సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News February 12, 2026
ఇవాళ దేశవ్యాప్తంగా బంద్

కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్‌కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్‌లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో బ్యాంకింగ్ సేవలకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగే అవకాశం ఉంది. స్కూళ్లు యథావిధిగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.


