News November 8, 2024

మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ మరోసారి బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముంబై పోలీసులకు ఈ థ్రెట్ మెసేజ్ అందింది. కాగా ఈ వారంలో సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇది మూడోసారి. కాగా రూ.50 లక్షలు ఇవ్వకపోతే షారుక్ ఖాన్‌ను చంపేస్తానంటూ నిన్న ఓ దుండగుడు పోలీసులకు ఫోన్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News September 18, 2025

ఈసీఐఎల్‌లో 160 ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని <>ECIL<<>> 160 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్‌లో కనీసం 60% మార్కులతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News September 18, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

APలోని రాయలసీమలో ఒకటి, రెండుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA హెచ్చరించింది. కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలోని HYDలో సాయంత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD పేర్కొంది.

News September 18, 2025

‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

image

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?